రాజకీయలబ్ధి ఉన్నప్పుడే స్పందిస్తారా?

రాజకీయలబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందిస్తారా? అని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

Published : 07 Oct 2022 04:52 IST

వాసిరెడ్డి పద్మకు అనిత సూటి ప్రశ్న

ఈనాడు-అమరావతి: రాజకీయలబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందిస్తారా? అని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఎక్కడెక్కడ వైకాపానకు రాజకీయంగా ఉపయోగపడుతుందో అక్కడ మాత్రమే బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేయాలని నిర్ణయించుకున్నారా అని నిలదీశారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 40 వరకు అఘాయిత్యాలు జరిగాయి. నిందితుల్లో కొందరు వాలంటీర్లు, వైకాపా నాయకులు ఉన్నారు. ఇటీవల స్థానిక సీఐ ఒక మహిళను దారుణంగా కొడితే మీరు నోరు మొదపలేదు. స్నేహలత అనే ఎస్సీ యువతిని చంపి కిరాతకంగా కాల్చినప్పుడు, తేజస్విని అనే ఫార్మసీ విద్యార్థినిని గ్యాంగ్‌ రేప్‌ చేసినప్పుడు, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ మాధవ్‌ విషయంలో మీరు ఎక్కడున్నారు? వైకాపా వాళ్లు అఘాయిత్యాలు చేసినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఇతరుల గురించి ఏమైనా దొరుకుతుందా అంటే ఒంటి కాలి మీద లేచి వస్తారు? నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించడం అంటే ఇదేనా? మీకు మనస్సాక్షి ఉంటే ప్రశ్నించుకోండి. అందరు మహిళలను సమానంగా చూసి సమన్యాయం చేయండి’ అని అనిత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని