550 శాతం రెవెన్యూ లోటులో రాష్ట్రం

రాష్ట్రం 550 శాతం రెవెన్యూ లోటులో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇంతటి రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా అప్పులకు అనుమతి ఇస్తుందా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Published : 07 Oct 2022 04:52 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రం 550 శాతం రెవెన్యూ లోటులో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇంతటి రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా అప్పులకు అనుమతి ఇస్తుందా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. అప్పులుగా తెచ్చిన నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఎంత..? లోటు ఎంతో తెలపాలని డిమాండ్‌ చేశారు. ‘పోలీసులకు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులెవరికీ సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. కేంద్రం కొత్త అప్పులు ఇవ్వకపోతే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కేవలం అస్మదీయులకు మాత్రమే బిల్లుల చెల్లింపులో మినహాయింపు ఉంది...’ అని పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర అద్వితీయంగా కొనసాగుతోందని, ఉండి, భీమవరంలలో పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందని రఘురామ చెప్పారు. అష్యుర్‌ కంపెనీకి మీ కూతురు, అల్లుడికి చెందిన కంపెనీ ఇన్‌ సెక్యూర్డ్‌ లోన్‌ ఇచ్చింది నిజం కాదా అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రఘురామ ప్రశ్నించారు. దసపల్లా భూములకు సంబంధించి కోర్టు తీర్పు ఎప్పుడు వచ్చిందో వెల్లడించాలన్నారు. రుషికొండపై 21.5 ఎకరాల్లో కొండను చెక్కి వేశారని, వాటికి సంబంధించిన చిత్రాలను ఆయన ప్రదర్శించారు. న్యాయస్థానానికి చెప్పిన దాని కంటే ఏడు ఎనిమిది రెట్లు ఎక్కువగానే కొండపై నిర్మాణాలను చేపడుతున్నారని రఘురామ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని