పార్టీకి ఉజ్వల భవిష్యత్తు

‘‘టీఆర్‌ఎస్‌... బీఆర్‌ఎస్‌గా మారింది. ఇది పరిణామక్రమం. టి అంటే టార్చ్‌. బి అంటే బ్రైట్‌. పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కేసీఆర్‌ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నాయకుడు.

Published : 07 Oct 2022 04:59 IST

వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్‌

‘‘టీఆర్‌ఎస్‌... బీఆర్‌ఎస్‌గా మారింది. ఇది పరిణామక్రమం. టి అంటే టార్చ్‌. బి అంటే బ్రైట్‌. పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కేసీఆర్‌ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నాయకుడు. తన ఆలోచనలు, పని విధానం, పోరాటాలు, విజయాలు దేనికదే ప్రత్యేకం. అతను తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. దళితబంధు, రైతు బంధు విప్లవాత్మక పథకాలు. ఈ దేశంలో మరే ముఖ్యమంత్రీ దళితులు, గిరిజనులు, రైతుల కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరును పెట్టడం గొప్ప విషయం. అందుకు అభినందనలు. తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు  కృత[జ్ఞతలు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో విచ్ఛిన్నతకు కారణమవుతున్న భాజపా రాజకీయాలను తిప్పికొట్టాలి. వీసీకే పార్టీ తరఫున మా శుభాభినందనలు తెలుపుతున్నాం’’ అని తిరుమావళవన్‌ అన్నారు.

* భారాసగా పేరు మార్పిడి కార్యక్రమానికి వచ్చిన కుమారస్వామి, తిరుమావళవన్‌ తదితర నేతలకు బుధవారం ఉదయం తమ నివాసంలో కేసీఆర్‌ అల్పాహార విందునిచ్చారు. వారు మధ్యాహ్నం తెలంగాణభవన్‌కు సీఎంతో పాటు వెళ్లి తెరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రగతిభవన్‌కు వచ్చి విందు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని