తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్‌ చంపేశారు: రేవంత్‌

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే సీఎం కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)ని ఏర్పాటు చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 Oct 2022 04:59 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే సీఎం కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)ని ఏర్పాటు చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన చంపేశారని విమర్శించారు. కేసీఆర్‌ దుర్మార్గపు ఆలోచనను తెలంగాణ బిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్‌సింగ్‌, జైరాం రమేష్‌ తదితరులు బుధవారం రేవంత్‌రెడ్డి ఇంటికి అల్పాహారానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని కేసీఆర్‌ గ్రహించారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కుట్ర చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి ఆయనకు అర్హత లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని