నేడు కూసుకుంట్లకు తెరాస బీ ఫారం!

మునుగోడులో తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ శుక్రవారం బీఫారం అందజేయనున్నట్లు తెలిసింది.

Published : 07 Oct 2022 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడులో తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ శుక్రవారం బీఫారం అందజేయనున్నట్లు తెలిసింది. పార్టీ పేరు మార్పుపై సీఈసీ నుంచి ఆమోదం లభిస్తే భారాస పేరు మీద బీ ఫారం ఇవ్వాలని కేసీఆర్‌ తొలుత భావించారు. అందుకు కొంత సమయం అవసరమని, ఇదే పేరుతో గానీ, దానికి దగ్గరగా గానీ ఏమైనా పేర్లు ఉన్నాయేమో పరిశీలించి, తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సీఈసీ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అభ్యర్థిని వెంటనే ఖరారు చేసి తెరాస బీఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

* ఉప ఎన్నికలో ప్రచార వ్యూహంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ గురువారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. మునుగోడులో పర్యటన, నేతల మధ్య సమన్వయంపై చర్చించారు. త్వరలో గట్టుప్పల్‌ గ్రామాన్ని కేటీఆర్‌ సందర్శించనున్నారు.  ప్రచారంలో దిగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బస, వసతులు, స్థానిక సమన్వయకర్తల ఎంపిక కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో గురువారం రాత్రి కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పనిచేసేందుకు 20 మంది బాధ్యులను ఎంపిక చేశారు. వామపక్ష నేతలతో నల్గొండలో జరిగిన సమన్వయ సమావేశం వివరాలను కేసీఆర్‌కు మంత్రి ఫోన్‌ ద్వారా సమాచారమందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని