విశాఖలో రాజధానికి అడ్డుపడే వారిని రాజకీయంగా చితక్కొట్టండి

విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు అడ్డుపడే వారందరినీ రాజకీయంగా చితక్కొట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Published : 08 Oct 2022 05:37 IST

మన పీక కోయడానికి అరసవల్లి వస్తారంట

రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

అరసవల్లి, గార, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు అడ్డుపడే వారందరినీ రాజకీయంగా చితక్కొట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవల్లిలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకులో, గార మండలం అంపోలులో జరిగిన మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబుకు వచ్చిన కష్టమేమిటి? మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందనవసరం లేదా? మేం మనుషులం కాదా... మాకు సదుపాయాలు అక్కర్లేదా...? విశాఖను రాజధానిగా వద్దనుకుంటూ శ్రీకాకుళం వస్తారంటా.. మన పీక కోయడానికి అరసవల్లి వస్తారంటా...’ అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.

సీఎం అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమించాలని యోచిస్తున్నా
‘విశాఖలో రాజధాని రాకుండా చేసే వారిని శత్రువులుగానే మనం చూడాలి. ఇందుకు ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ముఖ్యమంత్రి అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమానికి వెళ్లిపోదామా అనే ఆలోచన ఉంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నా గొంతెత్తితే లక్షలాది మంది అనుసరిస్తారన్న నమ్మకం ఉంది...’ అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇలాంటి అన్యాయాన్ని అరికట్టేందుకు అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని