Munugode Bypoll: తులం బంగారం అని రూ.3 వేలే ఇస్తారా?

ఇరవై రోజుల కిందట ఓటుకు రూ. 20 వేలు, రూ. 30 వేలు, తులం బంగారం అని చెప్పి తీరా చివరకు రూ.3 వేలు పంచుతున్నారేమిటని ఓటర్లు పలుచోట్ల ప్రధాన పార్టీల నేతలను ప్రశ్నిస్తున్నారు.

Updated : 02 Nov 2022 08:35 IST

నేతలను నిలదీస్తున్న ఓటర్లు

ఇరవై రోజుల కిందట ఓటుకు రూ. 20 వేలు, రూ. 30 వేలు, తులం బంగారం అని చెప్పి తీరా చివరకు రూ.3 వేలు పంచుతున్నారేమిటని ఓటర్లు పలుచోట్ల ప్రధాన పార్టీల నేతలను ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఓటుకు రూ.6 వేలకు పైగా ఇచ్చిన పార్టీలు ఇక్కడ అందులో సగం మాత్రమే ఇస్తున్నారేమిటని నాయకులను నిలదీస్తున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని ఓ గ్రామంలో మహిళా ఓటర్లు.. ఓటుకు రూ.10 వేలు పంపిస్తే మీరు రూ.3 వేలు మాత్రమే ఇవ్వడం ఏంటని నాయకులను ప్రశ్నించారు. ఇప్పటివరకు మీరు తిన్న డబ్బు సరిపోదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఇచ్చే నగదును సైతం పలుచోట్ల తిరస్కరించినట్లు సమాచారం.

* ప్రధాన పార్టీలన్నీ బూత్‌ల వారీగా ఓటర్లను లెక్కగట్టి అందులో 50 శాతం, 70 శాతం మేర నగదును పంపిణీ చేస్తున్నాయి. మునుగోడు మండలంలోని ఓ గ్రామంలో ఓ ప్రధాన పార్టీ ఆ గ్రామంలోని 40 శాతం ఓటర్లకే డబ్బులు ఇవ్వగా... మరో ప్రధాన పార్టీకి చెందిన గ్రామశాఖ అధ్యక్షుడి భార్య ఎదుటి పార్టీ తరఫున నగదు పంపిణీ చేస్తున్న నాయకుడితో గొడవకు దిగింది. తాను మాత్రం ఇదే పార్టీకి ఓటేస్తానని తనకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి తీసుకుంది.

* మరో పార్టీ తమ ఓటర్లతో పాటు తటస్థ ఓటర్లకు రూ.1000 చొప్పున పంపిణీ చేస్తోంది. డబ్బులిచ్చాకే ఓటేయడానికి రావాలని మొన్నటివరకు వలస ఓటర్లకు చెప్పిన ప్రధాన పార్టీల నాయకులు.. ఓటు వేస్తేనే డబ్బులిస్తామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని