Munugode Bypoll: కారుకు మళ్లీ గుర్తుల గుబులు

కారును పోలిన గుర్తులు తెరాసకు మరోసారి గుబులు పుట్టించాయి. మునుగోడు ఎన్నికలో ఈ గుర్తులు సుమారు అయిదువేలకు పైగా ఓట్లను పొందడం తెరాస మెజారిటీ తగ్గడానికి కారణమైంది.

Updated : 07 Nov 2022 08:49 IST

వాటికి అయిదువేలకు పైగా ఓట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కారును పోలిన గుర్తులు తెరాసకు మరోసారి గుబులు పుట్టించాయి. మునుగోడు ఎన్నికలో ఈ గుర్తులు సుమారు అయిదువేలకు పైగా ఓట్లను పొందడం తెరాస మెజారిటీ తగ్గడానికి కారణమైంది. కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యానికి గండికొట్టాయని, వాటిని తెరాస కోల్పోయిందని ఫలితం వెల్లడి అనంతరం కేటీఆర్‌ పేర్కొన్నారు. రోటీమేకర్‌ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు 2,407 ఓట్లు పడగా, రోడ్డు రోలర్‌గుర్తును పొందిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు 1,874 ఓట్లు లభించాయి. టెలివిజన్‌ గుర్తు గల లింగిడి వెంకటేశ్వర్లుకు 511, కెమెరా గుర్తుతో పోటీ చేసిన రాజేందర్‌కు 502 ఓట్లు, ఓడ గుర్తు అభ్యర్థి యదీశ్వర్‌కు 153 ఓట్లు  వచ్చాయి. చెప్పుల గుర్తు పొందిన డీఎస్పీ అభ్యర్థి గాలయ్యకు 2,270 ఓట్లు పడ్డాయి. రెండో ఈవీఎంలో ఆ గుర్తు రెండో స్థానంలో ఉంది. మొదటి ఈవీఎంలో తెరాస గుర్తు రెండోదిగా ఉండటంతో చాలా మంది పొరబడి ఆ అభ్యర్థికి ఓటు వేశారని తెరాస నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని