మంచి కాపలాదారుకే ఓటెయ్యండి
హిమాచల్‌ప్రదేశ్‌లో తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12న జరిగే ఎన్నికల్లో ఓటేయాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు పిలుపునిచ్చారు.
హిమాచల్ ప్రజలకు జేపీ నడ్డా పిలుపు
రాంపుర్, ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లో తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12న జరిగే ఎన్నికల్లో ఓటేయాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు పిలుపునిచ్చారు. భావోద్వేగాలకు లోనై వ్యవహరించొద్దని సూచించారు. మీ తోటలకు ఉత్తములైన తోటమాలులను ఎంచుకోవాలని కోరారు. రాంపుర్‌లో భాజపా అభ్యర్థి కౌల్సింగ్కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సింగ్ ఇన్ని సంవత్సరాలపాటు మంచి చౌకీదార్(గార్డు/కాపలాదారు)గా వ్యవహరించారని చెప్పారు. ఓటర్లను కాంగ్రెస్ అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు. హిమాచల్‌ప్రదేశ్ కూడా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల వలే రెండోసారి భాజపాకే పట్టం కడుతుందని నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ భాజపా ఇచ్చిన హామీ ఓట్ల ఏకీకరణ లక్ష్యంగా చేసింది కాదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్మశాలలో స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వైడ్ బాల్, ఆప్ నో బాల్: రాజ్‌నాథ్
ప్రతిపక్ష పార్టీలను విమర్శించేందుకు భాజపా సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం క్రికెట్ పరిభాషను ఉపయోగించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను వైడ్ బాల్‌గా, ఆప్‌ను నో బాల్‌గా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బైజ్నాథ్, బాల్హ్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రసంగిస్తూ రాజకీయ పిచ్‌పై భాజపా ఒక్కటే ‘గుడ్ లెంత్ డెలివరీ’ అని అభివర్ణించారు. గోవాలో ఎప్పటి నుంచో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉందని, అంతమాత్రాన అక్కడ సమాజంలో విభజన వచ్చిందా? అని ప్రశ్నించారు. సమాజంలో విభజన సృష్టించి ఓట్లు పొందాలని తాము భావించడంలేదని స్పష్టం చేశారు.
వచ్చే 25 ఏళ్లు భాజపాదే అధికారం : ఠాకూర్
హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే 25 ఏళ్లపాటు భాజపాయే అధికారంలో కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 12న శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో 1982 నుంచి ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి భాజపా, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు ఉంది.. అయితే ఆ ఆనవాయితీని బద్దలుకొట్టి, భాజపాకు తిరిగి పట్టం కట్టాలని ఈసారి ప్రజలు నిర్ణయించేసుకున్నారని జైరాం పేర్కొన్నారు. కుల్లు జిల్లాలోని బంజర్, శిమ్లా జిల్లాలోని చౌపాల్‌లో జరిగిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
రూ.9.3 కోట్ల నుంచి రూ.12 కోట్లకు..!
58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల్లో పెరుగుదల
మండి: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తున్న 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.12 కోట్లకు చేరింది. 2017 ఎన్నికల సమయంలో ఇది రూ.9.3 కోట్లుగా ఉంది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), హిమాచల్‌ప్రదేశ్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. వాస్తవానికి 49 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 5 నుంచి 1167 శాతం పెరిగాయి. మిగిలిన తొమ్మిది మంది శాసనసభ్యుల ఆస్తుల్లో తగ్గుదల కనిపించింది. అత్యధికంగా చౌపాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్బీర్‌సింగ్ వర్మ(భాజపా) ఆస్తులు 2017లో రూ.90.73 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.128.45 కోట్లకు పెరిగాయి.
గుజరాత్లో అధికారమివ్వండి: కేజ్రీవాల్
రాజ్‌కోట్: గుజరాత్లో మోర్బీ పాదచారుల వంతెన కూలి పోయిన ఘటనలో బాధితులకు ఏం జరిగిందో భాజపా పాలనలో ఆ రాష్ట్రంలో ఎవరికైనా అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆ దారుణ ఘటనకు సంబంధించి వంతెన మరమ్మతులు నిర్వహించిన ప్రైవేటు సంస్థ యజమానులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌కోట్, కలవాడ్‌లో సోమవారం జరిగిన ఓ రోడ్డుషోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే అయిదేళ్లు గుజరాత్‌ను పాలించే అవకాశం తమకు అందించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి