Vizag Railway Zone: విజయసాయిరెడ్డి గారూ... రైల్వే జోన్‌కు శంకుస్థాపన ఏదీ?
ప్రధాని విశాఖ పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న, జాతికి అంకితం చేసే జాబితాలోని 9 ప్రాజెక్టుల్లో విశాఖ రైల్వే జోన్ లేకపోవడంతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.
గత పదిరోజులుగా ఊదరగొడుతూ ప్రచారం చేశారుగా...!?
ప్రస్తుత మోదీ పర్యటనలో లేదని తేల్చిచెప్పిన ఎంపీ జీవీఎల్
ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు
ఈనాడు, విశాఖపట్నం: ప్రధాని విశాఖ పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న, జాతికి అంకితం చేసే జాబితాలోని 9 ప్రాజెక్టుల్లో విశాఖ రైల్వే జోన్ లేకపోవడంతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఎంపీ విజయసాయి చేసిన ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారంటూ... ఆయన పర్యటన ఖరారైన నాటి నుంచి విజయసాయిరెడ్డి ఊదరగొడుతూ వచ్చారు.
బుధవారం రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు పేర్కొన్న కార్యక్రమాల జాబితాలో ఈ అంశమే లేదు. దానిపై విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు... రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయాలని తామూ కోరామని ఒకసారి, ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తామని మరోసారి జీవీఎల్ పేర్కొనడం గమనార్హం. ప్రధాని కార్యక్రమాల్లో రూ.460 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ ప్రాజెక్టు ఉంటుందని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ విజయసాయిరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో... నవంబరు 12న ప్రధాని చేతుల మీదుగా రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరగనుందని పోస్టు పెట్టారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను పొందుపరిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై పార్లమెంట్లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
-
Movies News
Director Sagar: ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్‌పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య