Gujarat Election 2022: నరేంద్రమోదీ స్టేడియం పేరు మారుస్తాం: మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.

Updated : 13 Nov 2022 08:19 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. స్టేడియానికి తిరిగి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పేరు పెడతామని పేర్కొంది.

శనివారం కాంగ్రెస్‌ గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టోను రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ విడుదల చేశారు. ఇందులో 10 లక్షల ఉద్యోగాలు, ఎల్పీజీ సిలిండర్‌కు రూ.500, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర హామీలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తామని కూడా పేర్కొంది. 182 సీట్ల గుజరాత్‌ అసెంబ్లీకి వచ్చే నెల 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని