అమరావతి రాష్ట్రాభివృద్ధికి చిహ్నం.. రాజధానికి అది అనువైన ప్రాంతం: వసంత నాగేశ్వరరావు

గుంటూరు- విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం సర్వదా హర్షణీయమని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

Updated : 22 Nov 2022 08:25 IST

నందిగామ, న్యూస్‌టుడే: గుంటూరు- విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం సర్వదా హర్షణీయమని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అది చిహ్నమని అభిప్రాయపడ్డారు. ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. 29 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి జేజేలు పలుకుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్‌, విమానాశ్రయంతో పాటు కృష్ణా నది అందుబాటులో ఉన్నందున అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో ఉన్న విజయవాడ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని, రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కమ్మవారు ఉన్న రాష్ట్రంలోనే మంత్రి లేకపోతే ఆ సామాజిక వర్గానికి ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్లని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని