మోదీ అధికార దుర్వినియోగం: కూనంనేని

ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 25 Nov 2022 06:14 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌ నియామకం విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం కొత్త కాదని, ఇదివరకు సీబీఐ విషయంలోనూ ఇదే తరహాలో చెప్పిందని చెప్పారు. సీబీఐ, ఈడీ, సెంట్రల్‌ విజిలెన్స్‌, ఐటీ వంటి సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్రమ పద్ధతిలో గద్దెనెక్కుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బి.ఎల్‌.సంతోష్‌కు నోటీసులిస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కన్నీరు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వామపక్షాల గురించి మాట్లాడేటప్పుడు సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని