అటవీ అధికారి హత్యకు ముఖ్యమంత్రిదే బాధ్యత

పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ సమస్యను పరిష్కరించకపోవడంతోనే అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురయ్యారని, దీనికి సీఎం బాధ్యత వహించాలని ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 25 Nov 2022 06:13 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

వేములవాడ, న్యూస్‌టుడే: పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ సమస్యను పరిష్కరించకపోవడంతోనే అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురయ్యారని, దీనికి సీఎం బాధ్యత వహించాలని ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం తగదని, పార్టీల పరంగా దాడులు జరగవని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉంటుందని, నిజాయితీని నిరూపించుకోలేని వారే విమర్శలు చేస్తుంటారని పేర్కొన్నారు. ప్రజలను దోచుకుంటూ అక్రమంగా ఆస్తులు సంపాదించే వారిని అడ్డుకోవాలా? వద్దా? అన్న అంశాన్ని విమర్శించే వారే చెప్పాలని అన్నారు. రాజకీయంగా లబ్ధిపొందడానికే మద్యం కేసు విషయంలో సీఎం కేసీఆర్‌ స్పందించడంలేదని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని