కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు.

Updated : 25 Nov 2022 05:15 IST

ఏపీసీసీ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విశాఖపట్నం (జగదాంబ కూడలి), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా గురువారం విశాఖపట్నంలో ఆయన్ను నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొంపా గోవిందురాజు, పార్టీ శ్రేణులు సత్కరించాయి. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఉన్నత పదవులు దక్కుతాయనడానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాల పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి స్వాగతిస్తామని చెప్పారు. ఇప్పటికే పలువురు తనతో మాట్లాడారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని