మత్స్యకారుల ప్రగతి ప్రకటనలకే పరిమితం

మత్స్యకారుల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 25 Nov 2022 06:42 IST

జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌

ఎచ్చెర్ల, గార, గంట్యాడ, న్యూస్‌టుడే: మత్స్యకారుల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యల గుర్తింపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ.మత్స్యలేశంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామ వీధులను పరిశీలించిన అనంతరం సముద్రతీరంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ... ‘అధికార పార్టీ మంత్రులు, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మత్స్యకారుల సమస్యలు తెలుస్తాయి. వీరి గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం దారుణం. మత్స్యకార గ్రామాల్లో ప్రజలకు, యువతకు ఉపాధితోపాటు కనీస వసతులైన రోడ్లు, తాగునీటి సదుపాయాలూ అందుబాటులో లేవు. సీఎం జగన్‌ జిల్లా పర్యటనకు కర్ఫ్యూ వాతావరణంలో రావాల్సిన దుస్థితి ఏర్పడింది. జనసేన మత్స్యకార యువతకు అవసరమైన సహకారం అందిస్తుంది. అందులో భాగంగానే మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటుచేసి ఛైర్మన్‌ను కూడా నియమించాం. ఉత్తరాంధ్ర యువకులు ఉపాధి కోరుకుంటున్నారే తప్ప మూడు రాజధానులను కాదు’ అని స్పష్టంచేశారు.

పరదాలు, పోలీసులు లేకుంటే బయటకు రాలేరా?  

ప్రజాక్షేమాన్ని కోరుకునే వారే నాయకులని... పరదాల మాటున, పోలీసు బలగాల మధ్య పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడలో గురువారం జనసేన నాయకులు, వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. తనకు పింఛను నిలిపివేశారని చీపురుపల్లికి చెందిన అంధుడు అల్లాడ శ్రీనివాసరావు వాపోగా... అధికారులు పునరుద్ధరించే వరకు పార్టీ తరఫున ప్రతినెలా రూ.5 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని