జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారిగా భారత్‌ జోడో యాత్రలో గురువారం తన సోదరుడు రాహుల్‌ వెంట నడిచారు.

Published : 25 Nov 2022 04:23 IST

బోర్‌గావ్‌: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారిగా భారత్‌ జోడో యాత్రలో గురువారం తన సోదరుడు రాహుల్‌ వెంట నడిచారు. ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రేహాన్‌ కూడా ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. ఖండవా జిల్లాలోని రుస్తుంపుర్‌ వద్ద రాహుల్‌ను కలిసిన అనితా మహాజన్‌ (63) అనే మహిళ.. రైతు రుణమాఫీ ప్రకటిస్తే మధ్యప్రదేశ్‌లో అధికారం మీదే అని సూచించారు. రాహుల్‌, ప్రియాంక నడుస్తుండగా.. కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పక్కనున్న గిరిజనుల చేతుల్లోని విల్లంబులు అందుకొని వారిద్దరూ ఎక్కుపెట్టారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ సైతం యాత్రలో ఉత్సాహంగా నడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని