కేజ్రీవాల్‌ హత్యకు భాజపా కుట్ర : సిసోదియా

గుజరాత్‌, దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందని  ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా గురువారం సంచలన ఆరోపణ చేశారు.

Published : 25 Nov 2022 05:19 IST

దిల్లీ: గుజరాత్‌, దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందని  ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా గురువారం సంచలన ఆరోపణ చేశారు. ఇందులో దిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీ పాత్ర ఉందని పేర్కొన్నారు. ఆయన హత్యా ప్రణాళికను రూపొందించారని తెలిపారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడాలంటూ తన అనుచరులైన పోకిరీలను తివారీ బహిరంగంగానే ఉసిగొల్పుతున్నారని ట్విటర్‌లో వివరించారు. ప్రజలు ఇటువంటి వాటికి తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts