Uddhav thackeray: గవర్నర్‌ను కాదు.. అమెజాన్‌ పార్శిల్‌ను పంపారు: ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర గవర్నర్‌ బి.ఎస్‌.కోశ్యారీని అమెజాన్‌ పార్శిల్‌తో పోల్చారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే. ఆయన్ను కేంద్రం వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని గురువారం డిమాండ్‌ చేశారు.

Updated : 25 Nov 2022 07:48 IST

ఆయన మాకొద్దు.. వెనక్కి తీసుకోండి

ముంబయి/పుణె: మహారాష్ట్ర గవర్నర్‌ బి.ఎస్‌.కోశ్యారీని అమెజాన్‌ పార్శిల్‌తో పోల్చారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే. ఆయన్ను కేంద్రం వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని గురువారం డిమాండ్‌ చేశారు. ‘‘ఈ పార్శిల్‌ మహారాష్ట్రలో ఉండాలని కోరుకోవడం లేదు. మేం వద్దనుకుంటున్నాం కాబట్టి మీరు (కేంద్రం) వెనక్కి తీసుకోండి. వేరే రాష్ట్రానికి పంపించుకోండి’’ అని ఠాక్రే పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ.. పాత తరానికి చెందిన దిగ్గజమంటూ ఇటీవల కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రను ప్రేమించేవారంతా కోశ్యారీ ప్రకటనలను వ్యతిరేకించాలని ఠాక్రే పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని