అత్యాచార నిందితుడిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నం: మంద కృష్ణ మాదిగ

ఏపీలో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నిస్తున్నారని... దీనిపై సీఎం స్పందించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 26 Nov 2022 04:56 IST

గుంటూరు (బ్రాడీపేట), న్యూస్‌టుడే: ఏపీలో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నిస్తున్నారని... దీనిపై సీఎం స్పందించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘గుంటూరులో దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు సాంబయ్య చౌదరిపై ఈనెల 8న పట్టాభిపురంలో కేసు నమోదైనా ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. పైగా నిందితుడు, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిందితుడిని కాపాడేందుకు మంత్రి విడదల రజిని మరిది గోపీనాథ్‌ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. మంత్రి అనుచరులు నాకు, మా నాయకులకు ఫోన్‌ చేసి కేసు రాజీ చేసుకునేలా యత్నించాలని కోరారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించకుండా నేటికీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నేతలు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తంచేస్తుంటే.. నగరంపాలెం సీఐ వారిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు సీఐపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆందోళనలు చేస్తాం’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని