చంద్రబాబు అలా అనుకుంటున్నారని సీఎంకు చెప్పాం

‘ప్రతిపక్ష నేత ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నారు. అధికారంలోకి వస్తే పేదలకు భూపంపిణీ చేస్తామని హామీ ఇస్తున్నారు.

Published : 26 Nov 2022 04:56 IST

తర్వాతే పట్టాల జారీకి ఆదేశించారు
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘ప్రతిపక్ష నేత ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నారు. అధికారంలోకి వస్తే పేదలకు భూపంపిణీ చేస్తామని హామీ ఇస్తున్నారు. మేనిఫెస్టోలోనూ చంద్రబాబు భూ పంపిణీ అంశాన్ని చేరుస్తున్నారని మాకు తెలిసిన విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌కు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను కలిసి చెప్పాం. ఆ తర్వాతే ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న రైతుల్ని గుర్తించాలని, పట్టాల జారీకి సన్నాహాలు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం పత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం చిత్తూరులో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పేదలకు భూములు ఇస్తామని, గ్రామంలో శ్మశానాలకు స్థలాల్ని కేటాయిస్తామని మభ్యపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని