సీఎం సభ కోసం పొలం పాడుబెట్టాలా?

ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే తమకు హుకుం జారీ చేశారని.. అదును తప్పితే నష్టపోతామని పలువురు రైతులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు.

Published : 26 Nov 2022 04:56 IST

గుడివాడ రైతుల ఆవేదన

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే తమకు హుకుం జారీ చేశారని.. అదును తప్పితే నష్టపోతామని పలువురు రైతులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో ఇళ్ల సమీపంలో వచ్చే నెల 21న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సభ జరగనుంది. అందుకని.. తాము కౌలు చేస్తున్న 14 ఎకరాల్లో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే కొడాలి నాని ఆదేశించారని రైతులు నాగేశ్వరరావు, నాగరాజు శుక్రవారం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు. పస్తుతం అదును పోతుందని.. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులకు నష్టం జరగకుండా చూడాలని.. లేని పక్షంలో రైతులతో కలిసి సీఎం సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో పి.పద్మావతితో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని