నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు తెరాసలో చేరిక

యాదగిరిగుట్టకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ పురపాలక కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికార్‌ అరుణ, ముక్కెర్ల మల్లేశ్‌,  బిట్టు సరోజ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సామల పద్మావతి, మౌనిక తదితరులు శనివారం హైదరాబాద్‌లో తెరాసలో చేశారు.

Published : 27 Nov 2022 02:53 IST

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌
తాము చేరలేదని ప్రకటించిన ఇద్దరు కౌన్సిలర్లు
ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండవచ్చు: మరో ఇద్దరి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌, యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్టకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ పురపాలక కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికార్‌ అరుణ, ముక్కెర్ల మల్లేశ్‌,  బిట్టు సరోజ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సామల పద్మావతి, మౌనిక తదితరులు శనివారం హైదరాబాద్‌లో తెరాసలో చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కౌన్సిలర్లను అభినందించారు. యాదగిరిగుట్ట పురపాలిక అభివృద్దికి సహకరిస్తామని తెలిపారు.

మేం కాంగ్రెస్‌లోనే ఉన్నాం..

శనివారం సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకున్నాక.. తాము కాంగ్రెస్‌లోనే ఉన్నామంటూ ముక్కెర్ల మల్లేశ్‌, బిట్టు సరోజ భర్త హరీశ్‌లు ప్రకటించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సూచనలపై యాదగిరిగుట్ట పురపాలిక అభివృద్ధి కోసం మంత్రులను కలిసి చర్చించడానికి మాత్రమే ప్రగతిభవన్‌కు వెళ్లామని చెప్పారు. అంతకుముందు జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా తమపై పొరపాటున గులాబీ కండువాలు కప్పారని పేర్కొన్నారు. తామంతా ముందుగా నిర్ణయించుకున్నాకే.. తెరాసలో చేరామని, స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల వారు అలా మాట్లాడి ఉండవచ్చని మిగతా కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికార్‌ అరుణ చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు