వ్యవసాయ చట్టాల అమలుకు మళ్లీ యత్నం: కూనంనేని
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని చట్టాలను మళ్లీ అమలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
ఈనాడు, హైదరాబాద్: మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని చట్టాలను మళ్లీ అమలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని పేర్కొంటూ.. అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా శనివారం రాజ్‌భవన్‌కు ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను, నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. ‘‘స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ ధరలు నిర్ణయించే కమిటీల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, సన్న, చిన్నకారు రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని, వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. దీనిపై రాజ్‌భవన్‌కు శాంతియుతంగా ప్రదర్శన చేపడితే పోలీసులు అప్రజాస్వామికంగా అడ్డుకున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు ఇవ్వకుండా అటవీ సంరక్షణ చట్టం-2022 పేరుతో వారిని అడవుల నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయానికి రైతులతో కలిపి ఒక కమిటీ వేస్తామన్న కేంద్రం కార్పొరేట్ సంస్థలతో కమిటీ వేసింది. ముగ్గురు రైతులను మాత్రమే కమిటీలోకి తీసుకోవడం ఆక్షేపణీయం’’ అని కూనంనేని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది