దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచాలి: మంద కృష్ణమాదిగ

దివ్యాంగుల పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 27 Nov 2022 03:09 IST

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: దివ్యాంగుల పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) అధ్యక్షుడు గడ్డం కాశీం అధ్యక్షతన నిర్వహించిన వీహెచ్‌పీఎస్‌ మహాసభలో మంద కృష్ణమాదిగ పాల్గొని మాట్లాడారు. వీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగుల పింఛను సాధించామని వివరించారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను నెలకొల్పడంతోపాటు సహకార సంస్థను బలోపేతం చేయాలని, జీఓ నం.17ను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. దివ్యాంగులకు బస్సు, రైలు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని దివ్యాంగ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు ఎల్‌.గోపాల్‌రావు, జాతీయ కో-ఆర్డినేటర్‌ షణ్ముఖరావు, అందె రాంబాబు, నాగభూషణం, ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌, ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్‌మాదిగ, సుజాత, సూర్యవంశీ, విజయరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని