రాముడికి నిధులు ఎగ్గొట్టినోళ్లు ప్రజలకేం మేలు చేస్తారు
భద్రాచలం రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి ఎగ్గొట్టినోళ్లు ప్రజలకేం మేలు చేస్తారని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు.
తీన్మార్ మల్లన్న
భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: భద్రాచలం రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి ఎగ్గొట్టినోళ్లు ప్రజలకేం మేలు చేస్తారని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘7,200 ఉద్యమ’ పాదయాత్ర శనివారం భద్రాచలంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం, ఉచిత విద్య, వైద్యం నినాదాలతో మహా పాదయాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను 7,200 మంది పట్టిపీడిస్తున్నారని, వీరి సంఖ్యను సున్నా చేయడమే తమ లక్ష్యమన్నారు. బంగారు తెలంగాణ కోసం అనేక మంది త్యాగాలు చేస్తే తానే రాష్ట్రాన్ని తెచ్చానని కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. రూ.16 వేల కోట్ల నికర ఆదాయంతో రాష్ట్రం ఏర్పాటైతే రూ.5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ఆయనదేనన్నారు. పోడు భూముల విషయంలో గిరిజనులకు హామీలిచ్చి అధికారులను ఉసిగొల్పడం వల్లే అటవీ అధికారి ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అవినీతిమయంగా మారిన తెరాస పాలన నుంచి విముక్తి కోసం కొట్లాడేందుకు జనం తరలిరావాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’
-
General News
Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. కుప్పం చేరుకున్న బెంగళూరు వైద్య బృందం
-
Movies News
Social Look: చంద్రికా రవి ‘వాహనంలో పోజులు’.. ఐశ్వర్య ‘స్పై’ లుక్!
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్ను విసిరేసిన రణ్బీర్!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతి