MLA Rajaiah: కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే రాజయ్య

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 27 Nov 2022 08:46 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. తెరాస నాయకులు, కార్యకర్తలు, రాజయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘రాజయ్య వెంటే మేము ఉన్నాం.. ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం’ అంటూ నినాదాలు చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. మీ అభిమానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని కంటతడి పెట్టారు. రాజయ్యకు ఇచ్చే మర్యాద ఇదేనంటూ శ్రీపతిపల్లి గ్రామ నాయకుడు కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి రాజయ్యకు పాదాభివందనం చేయగా మళ్లీ సభావేదికపై రాజయ్య కంటతడి పెట్టారు. కార్యకర్తలు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు