సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత భాజపా ప్రభుత్వం రాజ్యాంగ ద్రోహిగా మారిందని, రాష్ట్రాల హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 27 Nov 2022 03:09 IST

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత భాజపా ప్రభుత్వం రాజ్యాంగ ద్రోహిగా మారిందని, రాష్ట్రాల హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత, గిరిజన, మైనారిటీ న్యాయవాద సంఘాల ప్రతినిధులతో శనివారం మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినోద్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ న్యాయవాదులు వినతిపత్రం అందించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు