ఉమ్మడి పౌరస్మృతి.. 20 లక్షల ఉద్యోగాలు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో విడుదల చేసింది.

Published : 27 Nov 2022 03:09 IST

ఎత్తయిన శ్రీకృష్ణుడి విగ్రహంతో ద్వారక కారిడార్‌
గుజరాత్‌ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన భాజపా

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో విడుదల చేసింది. తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక దళాలకు చెందిన స్లీపర్‌ సెల్స్‌ను గుర్తించి, వాటిని అంతం చేసేందుకు ‘యాంటీ రాడికలైజేషన్‌ సెల్‌’ను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. భాజపా ప్రధాన కార్యాలయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన (ఆయుష్మాన్‌ భారత్‌) కింద కుటుంబానికి ఇచ్చే కవరేజిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వంద అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, అందులో రూ.5కే భోజనం అందిస్తామని, ఈ సౌకర్యం మూడు పూటలా ఉంటుందని తెలిపింది. దేవభూమి ద్వారక కారిడార్‌ ఏర్పాటుచేసి దాన్ని పశ్చిమభారతంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తామంది. అందులో భాగంగా ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మిస్తామని తెలిపింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు