జోడో యాత్రలో పడబోయిన దిగ్విజయ్‌

రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ శనివారం పట్టుతప్పి పడబోయారు.

Updated : 27 Nov 2022 05:34 IST

మధ్యప్రదేశ్‌ రహదారులపై కాంగ్రెస్‌, భాజపా వాగ్వాదం

మణిహర్‌: రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ శనివారం పట్టుతప్పి పడబోయారు. వెంటనే స్పందించిన కార్యకర్తలు.. ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని బడ్వాహ్‌ పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. భాజపా పాలిత మధ్యప్రదేశ్‌లో రహదారులు సరిగాలేకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జి జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో కంటే మధ్యప్రదేశ్‌లోనే రహదారులు బాగున్నాయని గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ‘‘మధ్యప్రదేశ్‌ రహదారులు ప్రాణాంతకంగా ఉన్నాయి. వాషింగ్టన్‌ డీసీలో  కంటే మంచిగా లేవు. నేను కూడా ఇక్కడ మూడుసార్లు పడబోయాను’’ అని రమేశ్‌ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తల తోపులాటతోనే దిగ్విజయ్‌సింగ్‌ పడబోయారని, రహదారి బాగోక కాదని భాజపా నేత నరేంద్ర సలూజా ట్వీట్‌లో పేర్కొన్నారు. సంబంధిత వీడియోను పోస్ట్‌ చేశారు.  


మూడో రోజూ యాత్రలో పాల్గొన్న ప్రియాంక

రాహుల్‌ గాంధీ సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రెహాన్‌లు వరుసగా మూడో రోజు రాహుల్‌తో కలిసి భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని