Raghurama: నలుగురి చేతుల్లోనే ఏపీ ప్రభుత్వం: రఘురామ
కులం చూడం, మతం చూడబోమని సీఎం జగన్ తరచూ చెబుతున్న మాటలకు చేతలకు పొంతన ఉండదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
ఈనాడు, దిల్లీ: కులం చూడం, మతం చూడబోమని సీఎం జగన్ తరచూ చెబుతున్న మాటలకు చేతలకు పొంతన ఉండదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తన సామాజిక వర్గానికే చెందిన నలుగురి చేతుల్లో పెట్టారన్నారని ఆరోపించారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నిబంధనలను తుంగలో తొక్కిన సీఎం జగన్మోహన్రెడ్డి 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని డీజీపీగా తీసుకున్నారు. సీఎస్‌గానూ అదే జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. సీఎంవోను పూర్తిగా పులివెందులకు చెందిన ఐఏఎస్ అధికారి నియంత్రిస్తున్నారు. జగన్ తర్వాత కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. పార్టీపరంగా నియమించిన సమన్వయకర్తల్లోనూ 90% మంది సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అసలు చోటే కల్పించలేదు’ అని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ