దర్శిత్‌ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

రాష్ట్రంలో వరుస విద్యుత్తు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులకు అధికార మత్తు వదలడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 27 Nov 2022 06:03 IST

వరుస విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో వరుస విద్యుత్తు ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులకు అధికార మత్తు వదలడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూడేళ్ల చిన్నారి దర్శిత్‌ మరణించాడని విమర్శించారు. ‘కన్నవాళ్లతోపాటు రాష్ట్ర ప్రజల ప్రార్థనలు నిరర్థకమయ్యాయి. ఇప్పటికైనా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. దర్శిత్‌ కుటుంబానికి అండగా నిలిచి నష్టపరిహారం అందించాలి’ అని ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు