8న బీసీల ఆత్మీయ సమావేశం

వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన వైకాపా... డిసెంబరు 8న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

Published : 27 Nov 2022 04:56 IST

వైకాపా బీసీ నేతల నిర్ణయం

ఈనాడు, అమరావతి: వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన వైకాపా... డిసెంబరు 8న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, నాయకులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. బీసీ వర్గాలను పార్టీవైపు ఆకర్షించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. సమావేశం అనంతరం వేణుగోపాలకృష్ణ, జయరాం తదితరులు విలేకరులతో మాట్లాడారు. బీసీల ఆత్మీయ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ‘మా ప్రభుత్వం బీసీలకు అగ్ర ప్రాధాన్యమిస్తోంది. వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్‌ వివిధ పథకాల కింద ప్రజల ఖాతాల్లో రూ.1.76 లక్షల కోట్లు జమ చేస్తే... దానిలో రూ.88వేల కోట్లు బీసీలకే వెళ్లాయి. బీసీలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలమన్న అంశంపై డిసెంబరు 8న జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయిస్తాం’ అని వారు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు