Nellore: తెదేపా నాయకుడు కోటంరెడ్డిని కారుతో ఢీకొట్టిన యువకుడు
నెల్లూరులో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఆయన ఇంటివద్దే రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు సాయంత్రం కారుతో ఢీకొట్టి పరారయ్యాడు.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: నెల్లూరులో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఆయన ఇంటివద్దే రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు సాయంత్రం కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఆయన కాలుకు గాయాలయ్యాయి. పార్టీశ్రేణులు పెద్దఎత్తున చేరుకొని ఆందోళనకు దిగాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శ్రీనివాసులురెడ్డి కుమారుడు ప్రజయ్రెడ్డి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడు. ఆయనకు రాజశేఖర్‌రెడ్డితో కొంతకాలం క్రితం గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సాయంత్రం మద్యం మత్తులో రాజశేఖర్·రెడ్డి ఆదిత్యనగర్‌లోని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసానికి కారులో వచ్చాడు. గొడవకు దిగడంతో ఇంట్లో ఉన్న శ్రీనివాసులురెడ్డి వచ్చి రాజశేఖర్‌రెడ్డిని పంపే ప్రయత్నం చేశారు. అతను కారు ఎక్కడంతో శ్రీనివాసులురెడ్డి ఇంట్లోకి వెళుతున్నారు. ఈ సమయంలో కారును వేగంగా నడుపుతూ శ్రీనివాసులురెడ్డిని ఢీకొట్టి రాజశేఖర్‌రెడ్డి పరారయ్యారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదదృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాసులురెడ్డిపై దాడి ఘటనలో నిందితుడు రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లాలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీనివాసులురెడ్డికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన అపోలో ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. కారులో వెనుక ఉన్నవారెవరో తేలాలన్నారు. నెల్లూరులో రౌడీ రాజకీయాలు పెరిగాయని తెదేపా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు షేక్‌అబ్దుల్ అజీజ్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TTD APP: తితిదే యాప్ అప్డేట్.. శ్రీవారి భక్తుల కోసం ‘టీటీ దేవస్థానమ్స్’
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్‌కు భారత్ నోటీసు