Seediri Appalaraju: అప్పలరాజుకు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం: వైకాపా అసమ్మతి వర్గం హెచ్చరిక

వచ్చే ఎన్నికల్లో పలాస నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మంత్రి సీదిరి అప్పలరాజుకు టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ఆ పార్టీ అసమ్మతి వర్గ నాయకులు హెచ్చరించారు.

Updated : 28 Nov 2022 07:42 IST

హరిపురం (మందస), న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో పలాస నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మంత్రి సీదిరి అప్పలరాజుకు టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ఆ పార్టీ అసమ్మతి వర్గ నాయకులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో ఆదివారం వన భోజనాల సందర్భంగా జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరచారు. మంత్రి నియంతృత్వ పోకడలపై దుమ్మెత్తి పోశారు. మొదటిసారిగా ఎమ్మెల్యే కావడం కోసం గ్రామాల్లోని సీనియర్‌ నాయకుల నుంచి సీదిరి ఎంతో సహకారం పొందారని, మంత్రి అయ్యాక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీనియర్లను పక్కనపెట్టి అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవినీతి అక్రమాలపై అధిష్ఠానం దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు. వైకాపా జిల్లా కార్యదర్శి దువ్వాడ హేంబాబు చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, జుత్తు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు