షర్మిల పాదయాత్ర 3,500 కి.మీ.లు పూర్తి

సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెరాస పాలన కారణంగా సంక్షేమం, సమ న్యాయం కరవయ్యాయని వైఎస్‌ విజయమ్మ విమర్శించారు.

Published : 28 Nov 2022 04:17 IST

పైలాన్‌ను ఆవిష్కరించిన వైఎస్‌ విజయమ్మ
కుమార్తెను గెలిపించాలని విన్నపం

నర్సంపేట, న్యూస్‌టుడే: సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెరాస పాలన కారణంగా సంక్షేమం, సమ న్యాయం కరవయ్యాయని వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగం తెచ్చేందుకు తన కుమార్తె, వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రతో మీ ముందుకు వచ్చిందన్నారు. షర్మిల పాదయాత్ర ఆదివారంతో 3500 కి.మీ. పూర్తయిన సందర్భంగా వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పార్టీ వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ గార్డెన్‌లో నిర్మించిన పైలాన్‌ను విజయమ్మ ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘షర్మిల పాదయాత్రతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. పదేళ్ల కిందట 3,200 కి.మీ. నడిచిన మహిళ.. మళ్లీ ఇప్పుడు నమ్మిన సిద్ధాంతం, ప్రజల కోసం 3,500 కి.మీ పాదయాత్ర పూర్తి చేయడం గొప్ప విషయం. పాదయాత్ర చివరి దశకు చేరింది. 2023లో జరిగే యుద్ధానికి మీరంతా సమర శంఖం పూరించి షర్మిలకు అండగా నిలవాలి. 2023 ఎన్నికల్లో ఆమెను తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిని చేయాలి’’ అని విజయమ్మ కోరారు. సభలో ఆమె పలుమార్లు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు