కార్పొరేట్‌ శక్తులకు దేశం తాకట్టు

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు.

Published : 28 Nov 2022 04:17 IST

ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వడాయిగూడెం స్టేజ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సభకు భారీసంఖ్యలో ఏఐటీయూసీ కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. కుటీర పరిశ్రమలపై కేంద్రం జీఎస్టీ విధించిందని, విదేశీ పెట్టుబడుల కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాజు, ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ యూసఫ్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఉజ్జయిని రత్నాకర్‌రావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు గోద శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని