భారాస వస్తే స్వచ్ఛందంగా పన్ను చెల్లించేలా నిబంధన తెస్తాం

‘భారాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ దాడులు ఉండవు. ఎంత డబ్బు సంపాదించుకున్నా స్వచ్ఛందంగా పన్ను చెల్లించే విధంగా నిబంధనలను అమలు చేస్తాం.

Published : 28 Nov 2022 04:17 IST

ఐటీ దాడులు ఉండవు: మంత్రి మల్లారెడ్డి

ములుగు, న్యూస్‌టుడే: ‘భారాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ దాడులు ఉండవు. ఎంత డబ్బు సంపాదించుకున్నా స్వచ్ఛందంగా పన్ను చెల్లించే విధంగా నిబంధనలను అమలు చేస్తాం. భాజపా ప్రభుత్వం కక్ష కట్టి 500 మంది పోలీసులను పెట్టి సోదాలు చేయించింది. నాపై ఎన్నో కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా భయపడేది లేదు. కేసీఆర్‌ నా వెనుక ఉన్నంతకాలం నన్నెవరు ఏమీ చేయలేరు’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బైలంపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నేర్లపల్లి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం సర్పంచి స్వాతి, పీర్జాదిగూడ కార్పొరేటర్‌ మధుసూదన్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్మించిన నీటి ప్లాంటును ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో భారాస భారీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్నారు. పేదప్రజల కోసం అంబేడ్కర్‌ తర్వాత అంతగా ఆలోచిస్తున్న వ్యక్తి కేసీఆర్‌ మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని