బెంగాల్‌లో సీఏఏను అమలు చేసి తీరుతాం

పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసి తీరుతామని, ధైర్యముంటే దాన్ని అడ్డుకోవాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, భాజపా నాయకుడు సువేందు అధికారి సవాల్‌ విసిరారు.

Updated : 28 Nov 2022 05:46 IST

ధైర్యం ఉంటే అడ్డుకోండి: సువేందు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసి తీరుతామని, ధైర్యముంటే దాన్ని అడ్డుకోవాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, భాజపా నాయకుడు సువేందు అధికారి సవాల్‌ విసిరారు. బంగ్లాదేశ్‌ మూలాలున్న మతువా వర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తర 24 పరగణాల జిల్లా ఠాకూర్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. సీఏఏ కింద మతువా వర్గానికి పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌లో సీఏఏ వాస్తవరూపం దాల్చుతుందని, ప్రధాని మోదీ ప్రభుత్వం  దీనికి కట్టుబడి ఉందని కేంద్రమంత్రి శాంతను ఠాకుర్‌ పేర్కొన్నారు దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, మంత్రి ఫిర్హాద్‌ హకీం తీవ్రస్థాయిలో స్పందించారు. 2023లో పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటుబ్యాంకు రాజకీయాలపై కన్నేసిన భాజపా సీఏఏ కార్డును ప్రయోగిస్తోందన్నారు. దీన్ని ఎప్పటికీ రాష్ట్రంలో అనుమతించబోమని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని