బుల్లెట్‌ నడుపుతూ.. వీల్‌ఛైర్‌ తోస్తూ..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం ఇందోర్‌కు చేరుకున్న ఈ యాత్రలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా సమాజంలో వివిధ వర్గాల వ్యక్తులు పాల్గొన్నారు.

Published : 28 Nov 2022 05:09 IST

మధ్యప్రదేశ్‌లో ఉత్సాహంగా రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

ఇందోర్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం ఇందోర్‌కు చేరుకున్న ఈ యాత్రలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా సమాజంలో వివిధ వర్గాల వ్యక్తులు పాల్గొన్నారు. గ్వాలియర్‌ నుంచి వచ్చిన రజత్‌ పరాశర్‌ అనే బైకర్‌ రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా పరాశర్‌ బుల్లెట్‌ను గాంధీ కాసేపు నడిపారు. మనోహర్‌ అనే దివ్యాంగుడి వీల్‌ఛైర్‌నూ కాంగ్రెస్‌ అగ్రనేత తోస్తూ కనిపించారు. యష్‌రాజ్‌ పర్మార్‌ అనే బాలుడు తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని రాహుల్‌గాంధీకి అందిస్తూ.. ఈ మొత్తాన్ని యాత్ర కోసం వినియోగించాలని కోరారు. ‘‘హిందువులు, ముస్లింలను కలపడానికే భారత్‌ జోడో యాత్ర. అందుకే రాహుల్‌ దీన్ని చేపట్టారు’’ అని పర్మార్‌ తెలిపారు. దీనిపై రాహుల్‌ ‘‘త్యాగం, నిస్వార్థపరత్వం.. చిన్నతనంలోనే అలవరచుకొనే విలువలు. ఈ పిగ్గీ బ్యాంక్‌ నాకు అమూల్యమైనది. అనంతమైన ప్రేమ నిధి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు