Gujarat Election 2022: తమ్ముడు తమ్ముడే.. పార్టీ పార్టీయే

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ (ఉత్తర) స్థానంలో ఎన్నికల ప్రచారం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కడ భాజపా తరఫున ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బరిలో ఉన్నారు.

Updated : 28 Nov 2022 08:55 IST

ప్రచారంలో ప్రత్యర్థులుగా క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. ఆయన సోదరి

జామ్‌నగర్‌: గుజరాత్‌లోని జామ్‌నగర్‌ (ఉత్తర) స్థానంలో ఎన్నికల ప్రచారం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కడ భాజపా తరఫున ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి బిపేంద్రసిన్హ్‌  పోటీ చేస్తున్నారు. రివాబా తరఫున రవీంద్ర జడేజా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటుండగా.. అందుకు దీటుగా కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలను నయనాబా జడేజా తన భుజాల మీద వేసుకున్నారు. నయనాబా ఎవరో కాదు.. స్వయంగా రవీంద్ర జడేజా అక్క. సొంత అక్కాతమ్ముళ్లయినా, ఎన్నికల బరిలో తమ తమ పార్టీల విజయమే లక్ష్యంగా వారు పనిచేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ స్థానంలో ఆప్‌ కర్సన్‌ కర్మౌర్‌ను బరిలో దించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని