అక్రమ కేసులకు బెదిరేది లేదు: పరిటాల సునీత

తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు.

Updated : 29 Nov 2022 04:03 IST

సబ్‌జైలులో ఉన్న పార్టీ నాయకుడు జగ్గుకు పరామర్శ

ధర్మవరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. తమపై అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తెదేపా నాయకుడు గంటాపురం అప్పస్వామి అలియాస్‌ జగ్గును సోమవారం మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పరామర్శించారు. అనంతరం సబ్‌జైలు వద్ద విలేకరులతో సునీత మాట్లాడారు. ‘మొద్దు శీనుకు ఆ రోజే చెప్పి ఉంటే చంద్రబాబును చంపేవారని చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. పరిటాల రవీంద్ర హత్య వెనుక ఎవరున్నారో ఆయన చెప్పడం వాస్తవమే..’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని