పెడన వైకాపా నేతల దుర్మార్గాలను అరికట్టకపోతే రోడ్డెక్కుతాం: పవన్‌

పెడన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను వైకాపా నేతలు అణచివేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.

Updated : 29 Nov 2022 03:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పెడన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను వైకాపా నేతలు అణచివేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను వాల్‌పోస్టర్‌ ద్వారా ఎత్తిచూపినందుకు ముగ్గురు యువకులపై దాడి చేయడమే కాకుండా రక్షణ కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్తే.. పోలీసుల ఎదుటే విచక్షణారహితంగా కొట్టడం దారుణమని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. ‘దాడిచేసిన వారంతా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులే. బాధితుల్లో ఒకరు ఎస్సీ, మరొకరు ముస్లిం, ఇంకొకరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. వీరు మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నన్ను కలిశారు. ఎక్కడో వైకాపా నాయకుని కటౌట్‌కు నిప్పు పెడితే ఆ నేరాన్నీ బాధితులపైనే మోపి అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి మహిళల్ని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు, దాడులు ఇలాగే కొనసాగితే న్యాయం కోసం పెడనలో రోడ్డెక్కుతాం’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని