అహంకారం.. అధికార దుర్వినియోగం

తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ అహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 29 Nov 2022 04:21 IST

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ అహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భాజపాకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటోందని మండిపడ్డారు. సోమవారం అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భైంసా సభకు ఒకరోజు ముందు అనుమతి రద్దు చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఇలా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న సర్కార్‌ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. భాజపా ఎదుగుదలను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని, కేవలం కల్వకుంట్ల కుటుంబానికే న్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. భాజపా నేతలు గౌతంరావు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని