కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం: రేవంత్‌రెడ్డి
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గాంధీభవన్, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దామరచర్లకు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ బాధ్యత అని తెలిపారు. భూనిర్వాసితులకు పరిహారాలు, ఇతర సౌకర్యాలు, స్థానికులకు ఉద్యోగాలు, పోడు భూములకు పట్టాలు, జాబ్‌కార్డుల గురించి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం సీఎంను అడిగేందుకు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. నాయకుల అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమన్నారు.
సంగారెడ్డి, యాదగిరిగుట్ట వరకు మెట్రోను పొడిగించాలి: జగ్గారెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే: హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి, యాదగిరిగుట్టకు మెట్రోను పొడిగించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు సోమవారం లేఖ రాశారు. సంగారెడ్డి ప్రాంతంలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఎంఆర్ఎఫ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజలు, విద్యార్థులు ప్రతిరోజు హైదరాబాద్-సంగారెడ్డి మధ్య పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.