బూర్జువా పోకడలను జనమే నిలువరిస్తారు: పవన్
‘ఎన్నికల్లో పోటీ కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వానికి ఊపిరిపోస్తున్న తరుణంలో తాను ఎన్నికల్లో నిలబడతానంటూ సాధారణ గృహిణి పార్వతి ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయం.
ఈనాడు, అమరావతి: ‘ఎన్నికల్లో పోటీ కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వానికి ఊపిరిపోస్తున్న తరుణంలో తాను ఎన్నికల్లో నిలబడతానంటూ సాధారణ గృహిణి పార్వతి ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయం. ఈ తెగువ చూపిన పార్వతి మాటలు ప్రతి ఒక్కరికీ ఉత్తేజాన్నిస్తాయి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు. చీపురుపల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా జనసేన పక్షాన పోటీచేసిన పార్వతి నాదెండ్ల మనోహర్‌తో చెప్పిన మాటల వీడియోను ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. పోటీచేయొద్దని తనను ఎందరో భయపెట్టారని, అయినా తాను పోటీచేసి వెయ్యి ఓట్లు తెచ్చుకున్నానని పార్వతి అందులో పేర్కొన్నారు. ‘బూర్జువా పోకడలతో ఆధిపత్యం చలాయిస్తే పార్వతి లాంటివాళ్లు కచ్చితంగా నిలువరిస్తారు’ అని పవన్‌కల్యాణ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ ఖరారు.. ఇంకా తేలని బెర్తులు
-
Movies News
Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?