ఠాణాలో చంపుతామని బెదిరిస్తుంటే డీజీపీ ఏం చేస్తున్నారు

ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌లోనే చంపుతామని వైకాపా నాయకులు బెదిరిస్తుంటే రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

Published : 29 Nov 2022 04:38 IST

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌లోనే చంపుతామని వైకాపా నాయకులు బెదిరిస్తుంటే రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలు అమానవీయమని మండిపడ్డారు.  ‘సొంత బాబాయ్‌ను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన జగన్‌.. పరదాల మాటున తిరిగే పిరికిపంద’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ జాకీ పరిశ్రమ వైకాపా వాళ్ల వల్ల వెళ్లిపోయిందనడం తప్పా? రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోవడానికి అధికార పార్టీ నాయకుల బెదిరింపులే కారణం. ఎంత ధైర్యం ఉంటే లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకున్నాం అని చంద్రశేఖర్‌రెడ్డి అంటారు? వైఎస్సార్‌ చెప్పి ఉంటే జడ్‌ ప్లస్‌  భద్రత ఉన్న చంద్రబాబును మొద్దు శ్రీను చంపేవాడని ఆయన మాట్లాడటం వైకాపా ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నిదర్శనం. మైనింగ్‌, ఇసుక, మద్యం ద్వారా రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము వెనకేసిన అహంకారంతో వైకాపా వాళ్లు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. పేటీఎం బ్యాచ్‌తో తాడేపల్లి ప్యాలస్‌ స్క్రిప్ట్‌ను చదివిస్తున్నారు....’ అని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తే తమకు డిపాజిట్లు కూడా రావనే భయం వైకాపా వాళ్లకు పట్టుకుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు