Bandi Sanjay: భైంసాను దత్తత తీసుకుంటా
‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయం.‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయం. ప్రభుత్వం ఏర్పడగానే భైంసాను దత్తత తీసుకోవడమే కాదు.. ‘మైసా’గా పేరు మారుస్తాం’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఎన్నికలెప్పుడొచ్చినా కాషాయ జెండాదే గెలుపు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే పోరాటం: కిషన్‌రెడ్డి
ఈటీవీ, ఆదిలాబాద్: ‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయం. ప్రభుత్వం ఏర్పడగానే భైంసాను దత్తత తీసుకోవడమే కాదు.. ‘మైసా’గా పేరు మారుస్తాం’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన కేసీఆర్‌కు మూడిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.లక్ష అప్పు భారం పడుతోందని, అందుకే తెరాస ప్రభుత్వంపై యుద్ధం ప్రటించామని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు షరతుల మేరకు భైంసాకు 5 కి.మీ. దూరంలో ఉన్న ఓ జిన్నింగ్ పరిశ్రమ ఆవరణలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘హైకోర్టు సూచనలకు అనుగుణంగానే సభ నిర్వహిస్తున్నాం. పార్టీ తరఫున 3 వేల మందికే సమాచారం అందించాం. భాజపా చట్టాన్ని గౌరవించే పార్టీ. ఎంఐఎంలా ఉల్లంఘించేది కాదు. మత విద్వేషాలను రగిలించిన పచ్చజెండా పార్టీ వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు. భైంసా లాంటి ప్రాంతానికి రావడానికి వీసా తీసుకోవాలా? అదేమైనా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉందా? భైంసాలో బహిరంగ సభ ఉందని 144 సెక్షన్ పెట్టినట్లు తెలిసింది. రెండు సెక్షన్లు అదనంగా పెట్టినా ఇక్కడి ప్రజలు భయపడరు. ఎంఐఎం సభలకు ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించదు. భాజపా సభను అడ్డుకోవడానికి కుట్రలు చేశారు. సంక్రాంతి పండగను సైతం చేసుకోనీయకుండా భయపెట్టిన అల్లరిమూకలను అడ్డుకోవడంలో హిందూవాహిని కార్యకర్తలు చూపిన తెగువ అమోఘం. భాజపా ప్రభుత్వం ఏర్పడగానే భైంసాలో మా కార్యకర్తలపై నమోదైన పీడీ యాక్టులను ఎత్తివేస్తాం. పక్కా ఉద్యోగాలు కల్పిస్తాం. ఉచిత విద్య, వైద్యంతోపాటు నిలువనీడ లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
కడెం ప్రాజెక్టుకు అతీగతీ లేదు. బాసర ఆర్జీయూకేటీలో చుట్టపోళ్ల కాంట్రాక్టర్లను కాపాడేందుకు విద్యార్థులపై ర్యాగింగ్ నెపం మోపారు. న్యాయం, ధర్మం, సంస్కృతికి పాటుపడే భాజపా నేతలపై ఆంక్షలను విధించే ప్రభుత్వం మనకు కావాలా? నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 75 వేల మందితోపాటు ఇటీవల మరో 71 వేల మందికి ఉద్యోగాలిచ్చింది’’ అని సంజయ్ అన్నారు.
వంద మంది కేసీఆర్‌లు వచ్చినా మోదీని ఓడించలేరు: కిషన్‌రెడ్డి
వంద మంది కేసీఆర్‌లు, వంద బీఆర్ఎస్లు, మరో వంద ఎంఐఎంలు వచ్చినా నరేంద్ర మోదీని ఓడించలేరని.. 2024లో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుంభకోణాలన్నింటినీ వెలికితీసి అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని చెప్పారు. భైంసా బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘‘దేశ ప్రధాని, గవర్నర్, చివరికి రాజకీయ పార్టీలన్నా సీఎంకు గౌరవం లేదు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ అంటే మాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. కేసులు పెట్టి భయపెట్టేందుకు ప్రయత్నించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. భాజపా శ్రేణులను అరెస్టు చేస్తే జైళ్లు సరిపోవు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ నియంతలా వ్యవహరిస్తున్న వారిలో కేసీఆర్ మొదటి వ్యక్తి కాదని, చివరి వ్యక్తీ కాదని అన్నారు. ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజలను జైళ్లలోకి నెట్టిన ఇందిరా గాంధీ ప్రభుత్వమే మట్టిలో కలిసిపోయిందని, కేసీఆర్ అంత కంటే గొప్పనా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో ఎంపీ సోయం బాపురావు, నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రమేష్ రాఠోడ్, గంగిడి మనోహర్‌రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, రమాదేవి, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం శ్రేణుల సందోహం మధ్య సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. భైంసా మండలం గుండెగావ్ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరం వరకు కొనసాగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్