గుజరాత్‌ ఎన్నికలు.. ముగిసిన తొలిదశ ప్రచారం

గుజరాత్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరా హోరీగా కొనసాగిన తొలి దశ ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Published : 30 Nov 2022 04:03 IST

89 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరా హోరీగా కొనసాగిన తొలి దశ ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్‌, కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు డిసెంబరు 1న (గురువారం) పోలింగ్‌ నిర్వహిస్తారు. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా-89, కాంగ్రెస్‌-89, ఆప్‌-88 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం తదితర పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్యే నెలకొంది. తొలి విడత పోలింగ్‌ జరిగే స్థానాల్లో పోటీలో ఉన్న ప్రముఖుల్లో ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గాఢ్వీ, గుజరాత్‌ ఆప్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా తదితరులున్నారు.

భాజపా తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆప్‌ తరఫున కేజ్రీవాల్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రెండు రోజులు మాత్రమే ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు