భాజపాకు రూ.614.53 కోట్లు!

విరాళాలను సమకూర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ(భాజపా) దేశంలోని మిగతా రాజకీయ పక్షాల కన్నా ఎంతో ముందంజలో ఉంది.

Published : 30 Nov 2022 04:03 IST

2021-22లో అందిన విరాళాలివి: ఈసీ

దిల్లీ: విరాళాలను సమకూర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ(భాజపా) దేశంలోని మిగతా రాజకీయ పక్షాల కన్నా ఎంతో ముందంజలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలుగా లభించాయని ఎన్నికల సంఘం డేటా ఆధారంగా తెలుస్తోంది. విపక్ష కాంగ్రెస్‌ పార్టీకి లభించిన రూ.95.46 కోట్ల కన్నా ఇది ఆరు రెట్లకు పైగా అదనం. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం... వ్యక్తులు, సంస్థల నుంచి రూ.20వేలకు మించి సమకూరిన విరాళాల వివరాలతో కూడిన వార్షిక నివేదికను ప్రతి రాజకీయ పార్టీ ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు